జాబ్స్
నల్లగొండ : నిరుద్యోగులకు ఈ ఏడాది కలిసొచ్చింది. ప్రభుత్వం పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసింది. గడిచిన పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల కావడం కోర్టు కేసులతో పరీక్షలు నిర్వహించకపోవడం.. ఒకవేళ నిర్వహించినా లీకేజీ కారణంగా రద్దయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో నిరుద్యోగులంతా నిరాశలో ఉండిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి కొన్ని పరీక్షలు నిర్వహించడంతోపాటు.. పోస్టింగ్‌లు కూడా ఇచ్చింది. దీంతో చాలామంది ఉద్యోగాలు పొందారు. ఈ ఏడాది తమకు ఎంతో కలిసొచ్చిందని కొత్తగా కొలువులు సాధించిన అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ఈ ఏడాది జూలైలో పూర్తయింది. ఏళ్లుగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు తాము కోరుకున్న చోట బదిలీ జరగడంతో సంతోషంలో ఉన్నారు. ఎస్‌జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా.. స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్‌ఎంలుగా పదోన్నతి పొందారు. నల్లగొండ జిల్లాలో 1023 మందికి ప్రమోషన్ లభించగా.. 2291 మందికి బదిలీ అయ్యింది. సూర్యాపేట జిల్లాలో 102 మంది జీఎచ్‌ఎంలుగా పదోన్నతి పొందగా.. 641 మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా పదోన్నతి లభించింది. మొత్తం 800 మందికి ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 400 మందికి పదోన్నతి లభించగా, 590 మందికి బదిలీ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment