ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టొద్దు
నల్లగొండ: ప్రజావాణిలో ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవా రం నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 66 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందించారన్నారు. ఫిర్యాదుదారులు కార్యాలయం చుట్టూ తిరగకుండా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని, లేకుంటే ఎందుకు పరిష్కారం కావడం లేదో ఫిర్యాదుదారుకి తెలియపర్చాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేయనివారు ప్రస్తుతం ఎంపీడీఓ, మున్సి పల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మంగళవారం వరకు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌ఓ అమరేందర్, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి
బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment