మఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా స్వామి, అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రమ్యంగా రక్తికట్టించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్య్యధారణ, తలంబ్రాల మహోత్సవం నిర్వహించారు. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment