పథకాలకు అర్హులు వీరే..
కొత్త దరఖాస్తుల స్వీకరణ
నాలుగు పథకాలకు సంబంధించి సిద్ధం చేసిన అర్హుల జాబితాలో పేర్లు లేని.. అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే తిరిగి మళ్లీ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అంతేగాకుండా ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఇచ్చినా గ్రామసభల్లో తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల అర్హుల జాబితాలపై మంగవారం నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు పథకాలపై ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో సర్వే నిర్వహించి అర్హుల జాబితాను తయారు చేశారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు గ్రామసభలు నిర్వహించి ఇప్పటికే తయారు చేసిన అర్హుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించి గ్రామసభ ఆమోదం తీసుకోనున్నారు. ఈ నెల 26న జరగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ పథకాలను కలెక్టర్, ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించనున్నారు.
నాలుగు రోజుల పాటు గ్రామసభలు..
మంగళవారం నుంచి 24వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఈ పథకాల అర్హుల జాబితాలను గ్రామసభల్లో ఒక్కోటిగా చదివి వినిపిస్తారు. అందులో ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా పరిగణనలోకి తీసుకుంటారు. వాటన్నింటిని లిఖిత పూర్వకంగా రికార్డుల్లో పొందుపరుస్తారు. వాటి పరిష్కారానికి చర్చలు తీసుకుంటారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సంబంధిత పథకం అర్హుల జాబితాను గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటిస్తారు.
మండలానికి 6 నుంచి 8 బృందాలు..
గ్రామసభల నిర్వహణ కోసం ప్రతి మండలానికి 6 నుంచి 8 బృందాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఈఓ, డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు మండల స్థాయి ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, ఇతర అధికారుల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు అన్ని గ్రామాల్లో రోజుకో చోట గ్రామసభ నిర్వహించనున్నారు. గ్రామసభలో ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యనూ రికార్డు చేయాల్సి ఉంటుంది. గ్రామసభల నిర్వహణపై సంబంధిత బృందాలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
ఫ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల జాబితాలు సిద్ధం
ఫ నేటి నుంచి గ్రామసభల నిర్వహణ
ఫ గ్రామసభ ఆమోదంతో లబ్ధిదారుల ఎంపిక
ఫ కొత్త దరఖాస్తులూ స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment