ఈ తహసీల్దార్.. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ !
రామన్నపేట: చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలనే నిబంధన ఉంది. దీనిని అనుసరిస్తూ రామన్నపేట తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న చిలుకూరి లాల్‌బహదూర్‌శాస్త్రి నిత్యం చేనేత వస్త్రాలు ధరించి విధులకు హాజరవుతూ చేనతకు బ్రాండ్ అంబాసిడర్ నిలుస్తున్నారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన తనకు చేనేత వస్త్రాలు ధరించడమంటే చాలా ఇష్టమని తెలిపారు. సిరిపురం, వెల్లంకి గ్రామాల్లో చేనేత కార్మికులు తయారుచేసిన క్లాత్ కొని ఇరవైకి పైగా చొక్కాలు కుట్టించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దేశ నాయకుల పేర్లు పెట్టిన తండ్రి
తహసీల్దార్ లాల్‌బహదూర్‌శాస్త్రి స్వస్థలం దేవరకొండ టౌన్ కాగా.. ఆయన తండ్రి చిలుకూరి విశ్వం, తల్లి రంగమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన తండ్రికి దేశభక్తి భావాలు ఎక్కువని, భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మృతిచెందినప్పుడు తన అన్న జన్మించడంతో ఆయనకు జవహర్‌లాల్ నెహ్రూ అని, రెండో ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి మృతిచెందినప్పుడు తాను జన్మించడంతో తనకు లాల్‌బహదూర్‌శాస్త్రి అని పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు.
నిత్యం చేనేత వస్త్రాలు
ధరించి విధులకు హాజరు
ఈయన పేరు
లాల్‌బహదూర్‌శాస్త్రి
అన్న పేరు జవహర్‌లాల్ నెహ్రూ
Comments
Please login to add a commentAdd a comment