యాదగిరీశుడి హుండీ ఆదాయం లెక్కింపు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.4,17,13,596 వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. హుండీల్లోని నగదు, నగలును సోమవారం కొండకు దిగువన శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఇందులో నగదు రూ.4,17,13,596 రాగా, మిశ్రమ బంగారం 228 గ్రాములు, మిశ్రమ వెండి 7కిలోల 50 గ్రాములు వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూఏఈ, నేపాల్, సౌదీ అరేబియా, సింగపూర్, ఖతార్, ఒమాన్, కెనడా, మలేషియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జార్జియా, థాయిలాండ్, ఇండోనేషియా తదితర దేశాలకు చెందిన కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయం 47 రోజులదని చెప్పారు.
47 రోజులకు రూ.4.17కోట్లు
Comments
Please login to add a commentAdd a comment