ఆటలతో మానసిక ఆనందం
రామగిరి(నల్లగొండ) : ఆటలతో మానసిక ఆనందం కలుగుతుందని జిల్లా ప్రధాన ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలను సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సంపూర్ణానంద్, దుర్గాప్రసాద్, విశ్వనాథ్ కులకర్ణి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సిరిగిరి వెంకట్‌రెడ్డి, గిరి లింగయ్యగౌడ్, క్రీడల కార్యదర్శి సూర్యచంద్రశేఖర్‌రావు, మహిళా కార్యదర్శి నాంపల్లి భాగ్య, న్యాయవాదులు నూకల నర్సింహారెడ్డి, ఎస్‌ఆర్.ఠాగూర్, ఎన్.భీమార్జున్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌చక్రవర్తి, నజీజ్‌ఫాతిమా, సుమనశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment