అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
వలిగొండ: వలిగొండ మండలం టేకులసోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని పనుమటివారిగూడెంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం పట్టుకుని సీజ్ చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పనుమటివారిగూడేనికి చెందిన కిరాణా వ్యాపారి కొడితాల వెంకటేశం చుట్టుపక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి తన ఇంట్లో నిల్వ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పౌరసరఫరాల శాఖ అధికారి బాలమణిలా ఆధ్వర్యంలో సోమవారం వెంకటేశం ఇంటిపై దాడులు చేసి సుమారు 100 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment