భువనగిరిటౌన్: సేవాలాల్ జయంతిని సెలవురోజుగా ప్రకటించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ రాజేష్‌నాయక్ డిమాండ్ చేశారు. లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం భువనగిరి పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోర్ బోలి’ని లంబాడీ భాషగా గుర్తించాలన్నారు. లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ధరావత్ రాజునాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాములునాయక్, పట్టణ అధ్యక్షుడు మోహన్‌నాయక్, ఉద్యోగాల సంఘం జిల్లా నాయకులు నరసింహనాయక్, జిల్లా నాయకులు, దేవేందర్‌నాయక్, గుగులోత్ హచ్చునాయక్, నాగేశ్వర్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment