హైదరాబాద్ కిడ్నీ సెంటర్ వైద్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి
చౌటుప్పల్ : హైదరాబాద్ మలక్‌పేటలోని హైదరాబాద్ కిడ్నీ సెంటర్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎర్రబోతు విష్ణువర్ధన్‌రెడ్డి(68) సోమవారం మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లోని తంగడపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే జరిగింది. వైద్య వృత్తిలోకి వచ్చాక సొంతంగా ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మంది కిడ్నీ రోగులకు వైద్య సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డాక్టర్ విష్ణువర్దన్‌రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం మృతిచెందారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి విష్ణువర్దన్‌రెడ్డికి నివాళులు అర్పించారు.
లారీ ఢీకొట్టడంతో
విరిగిన విద్యుత్ స్తంభం
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామ చౌరస్తాలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని లారీ వేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం కిందిభాగంలో విరిగిపోయింది. లారీ బలంగా ఢీకొట్టడంతో స్తంబానికి ఉన్న సర్వీస్ వైర్లు, కేబుల్ వైర్లతో పాటు ఇతర స్తంభాల నుంచి ఉన్న విద్యుత్ లైన్ తెగిపోయింది. సోమవారం ఉదయం వరకు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా మరో స్తంభం ఏర్పాటు చేసి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
● కాపాడిన పోలీసులు
రామన్నపేట : రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం రామన్నపేట నుంచి చిట్యాల రైలు మార్గంలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లగా.. స్థానికులు గమనించి డయల్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో
తీవ్ర గాయాలు
మునగాల: మునగాల మండల పరిధిలోని కృష్ణానగర్–బరాఖత్‌గూడెం గ్రామాల మధ్య నడిగూడెం రోడ్డుపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన కర్నె నగేష్ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బైక్‌పై కృష్ణానగర్ నుంచి స్వగ్రామం వస్తుండగా.. మార్గమధ్యలో బైక్ అదుపుతప్పడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న నగేష్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment