చోరీలకు పాల్పడుతున్న యువకుల అరెస్ట్
రామగిరి(నల్లగొండ): గంజాయి విక్రయంతో పాటు చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి సోమవారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం నామనాయక్ తండాకు చెందిన కొడావత్ విక్రమ్, కొండమల్లేపల్లి మండలం దంజిరాల్‌తండాకు చెందిన వడ్త్య నాగరాజు, మిర్యాలగూడ మండలం కాల్వలపల్లికి చెందిన ధనావత్ సందీప్‌నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం తుంబాయితండాకు చెందిన జరుప్లా నవీన్‌కుమార్ కలిసి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని బంజారా కాలనీలో ఉంటున్నారు. గంజాయికి అలవాటు పడిన వీరు నలుగురు తాళం వేసిన ఇళ్లతో పాటు వాహనాలు చోరీ చేస్తున్నారు. సోమవారం ఉదయం నార్కట్‌పల్లి సమీపంలోని మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో గంజాయి అమ్మేందుకు వచ్చారు. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో అక్కడకు వెళ్లి అనుమానాస్పదంగా కనిపించిన వీరి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గంజాయి కొనుగోలు చేసి దొంగిలించిన వాహనాల్లో వచ్చి మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కామినేని మెడికల్ కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. కొడావత్ విక్రమ్‌పై 20 కేసులు, వడ్త్య నాగరాజుపై 11 కేసులు, ధనావత్ సందీప్‌నాయక్‌పై 23 కేసులు, జరుప్లా నవీన్‌కుమార్‌పై 9 కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో 4 కేసులు, చౌటుప్పల్ పీఎస్‌లో 3 కేసులు, వనస్థలిపురం పీఏస్‌లో 1 కేసు, సరూర్‌నగర్ పీఎస్‌లో 1 కేసులు ఉన్నాయని, వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్‌ఐ క్రాంతికుమార్, ఏఎస్‌ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, అఖిల్, గిరిబాబు, తిరుమల్, శివశంకర్, మహేష్, హరిప్రసాద్, సాయికుమార్‌ను నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.
గంజాయి కూడా విక్రయిస్తున్న
నిందితులు
వివరాలు వెల్లడించిన
నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment