మోత్కూరు: గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడడంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరు మండలం రాగిబావి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాగిబావి గ్రామానికి చెందిన రాంపాక సోమయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు ఉపేందర్(26)కు వివాహం కాలేదు. సోమవారం గ్రామంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. అతడి అంత్యక్రియల కోసం శ్మశానవాటిక వద్దకు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్‌ను తీసుకెళ్లారు. అంత్యక్రియల అనంతరం ఆ వాటర్ ట్యాంకర్‌ను ఉపేందర్ గ్రామంలోకి తీసుకొస్తుండగా.. మార్గమధ్యలో అదుపుతప్పి బోల్తాపడడంతో మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment