తగ్గిన ఉల్లి ధర | - | Sakshi
Sakshi News home page

తగ్గిన ఉల్లి ధర

Published Fri, Sep 27 2024 2:24 AM | Last Updated on Fri, Sep 27 2024 2:24 AM

-

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లి ధర తగ్గింది. బుధవారం నాటితో పోలిస్తే క్వింటాపై రూ.246 తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 25న క్వింటాకు గరిష్టంగా రూ.4389, 26న గరిష్ట ధర రూ.4,143 లభించింది. పెరగాల్సిన ఉల్లి ధర తగ్గడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌కు 147 మంది రైతులు 3,720 క్వింటాళ్ల ఉల్లి తీసుకొచ్చారు.

● వేరుశనగ మార్కెట్‌కు 535 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.2,257, గరిష్ట ధర రూ.7,350 లభించింది. సగటు ధర రూ.5389 నమోదైంది.

● మార్కెట్‌కు కొర్రలు 430 క్వింటాళ్లు రాగా.. కనిష్టంగా రూ.1,929, గరిష్టంగా రూ.2869 లభించింది. సగటు ధర రూ.2296 నమోదైంది.

● సజ్జలు మార్కెట్‌కు 318 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.1,970, గరిష్ట ధర రూ.2,101 లభించగా.. సగటు ధర రూ.2061 నమోదైంది.

● ఆముదాలు 686 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్టంగా రూ.5,209, గరిష్ట ధర రూ.5,949 లభించగా.. సగటు ధర రూ.5902 నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement