ఎకై ్సజ్‌లోకి ‘సెబ్‌’ విలీనం | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌లోకి ‘సెబ్‌’ విలీనం

Published Fri, Sep 27 2024 2:24 AM | Last Updated on Fri, Sep 27 2024 2:24 AM

ఎకై ్సజ్‌లోకి ‘సెబ్‌’ విలీనం

20 శాతం పెరగనున్న

దుకాణాలు

ప్రభుత్వ మద్యం దుకాణాలు తొలగించి కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుంది. మద్యం దుకాణాల అనుమతులకు సంబంధించిన ప్రకటన (గెజిట్‌) కలెక్టర్‌ విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయంపై ఎకై ్సజ్‌ డిప్యుటీ కమిషనర్‌ కలెక్టర్‌తో చర్చించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 83, నంద్యాల జిల్లాలో 93 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. నూతన పాలసీలో అదనంగా మరో 20 శాతం దుకాణాలు పెరగనున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించి లక్కీడిప్‌ విధానంలో అనుమతులు కేటాయించే విధానం అమలు చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కర్నూలు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లుగానే పాత విధానంలోకి ఎకై ్సజ్‌ స్టేషన్లు వచ్చాయి. కర్నూలు జిల్లాకు ఏడు, నంద్యాల జిల్లాకు ఏడు చొప్పున స్టేషన్లు ఉన్నాయి. మద్యం డిపోలు కూడా గతంలో ఉన్నట్లుగానే కేటాయించారు. నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా సెబ్‌ స్థానంలో ఎౖక్సైజ్‌ శాఖకు పునర్వ్యవస్థీకరించి అక్టోబర్‌ మొదటి వారంలో కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జిల్లాలో ఉన్నతాధికారుల నియామకం కూడా పూర్తి కావడంతో నూతన పాలసీపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు నూతనంగా నియమితులైన డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి నూతన ఎకై ్సజ్‌ పాలసీ రూపకల్పనలో కోర్‌ కమిటీ సభ్యురాలు కావడంతో విధుల్లో చేరిన వెంటనే కలెక్టర్‌ను కలసి జిల్లాలో పాలసీ అమలుపై చర్చించారు. దుకాణాల కేటాయింపు, రుసుముల చెల్లింపు, ఉత్తర్వులు కూడా ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చాలా చోట్ల సరుకు నిల్వలు చివరి దశకు చేరినట్లు సమాచారం.

సిబ్బంది కేటాయింపు ఇలా...

ఎకై ్సజ్‌ శాఖ పునర్వవస్థీకరణలో భాగంగా డిస్టిలరీలతో పాటు జిల్లాలో పరిపాలన, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, చెక్‌పోస్టుల నిర్వహణకు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, కోసిగి, ఆదోని, ఆలూరు, పత్తికొండలో ఎకై ్సజ్‌ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో పనిచేసేందుకు 24 మంది సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 28 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 150 మంది కానిస్టేబుళ్లను నియమించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఇలా...

ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్‌ నేరాల నియంత్రణకు పాత పద్ధతిలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఏఈఎస్‌, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు, ఆరు మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 17 మంది కానిస్టేబుళ్లను నియమించారు. అలాగే దుకాణాలకు మద్యం సరఫరా చేసే బాధ్యత డిపో మేనేజర్‌కు అప్పగించి కొత్తగా మేనేజర్‌ను నియమించారు. రికార్డుల నిర్వహణతో పాటు దుకాణాలకు మద్యం చేరవేసే బాధ్యత వీరికి ఉంటుంది. ఇందులో ఒక సీఐ, ఒక ఎస్‌ఐ, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ముగ్గురు పీసీలను కేటాయించారు. అలాగే ఈఏటీఎఫ్‌లో ఒక ఏఈఎస్‌, ఒక ఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఐదు మంది పీసీలను కేటాయించారు. యూనిట్‌ హెడ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో వీరు విధులు నిర్వహిస్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు పరిపాలన, నేర పర్యవేక్షణ, స్టేషన్ల పర్యవేక్షణ బాధ్యతలు ఈఎస్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈఎస్‌కు అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సహాయకారిగా వ్యవహరిస్తారు.

ఏడు చెక్‌పోస్టులు...

జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు, ఒక మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీ, ఈఎస్‌టీఎఫ్‌ స్క్వాడ్‌, కంట్రోల్‌ రూమ్‌, ఐఎంఎల్‌ డిపో, బీఎంబీపీలను కేటాయించారు. చెక్‌పోస్టులు, స్టేషన్ల పర్యవేక్షణకు సీఐలు, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, సిబ్బందిని నియమించాల్సి ఉంది. జిల్లాలో నోడల్‌ డిప్యుటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ డిప్యూటీ కమిషనర్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ల భర్తీ ప్రక్రియ పూర్తి కావడంతో నూతన మద్యం విధానం అమలుపై కసరత్తు ముమ్మరం చేశారు. మద్యం దుకాణాలు, బార్‌ల పర్యవేక్షణతో పాటు సారా, అక్రమ మద్యం, గంజాయి రవాణా విక్రయాలను అడ్డుకట్ట వేసే బాధ్యతలు స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి అప్పగించారు. ఇప్పటివరకు సెబ్‌ పర్యవేక్షించిన ఇసుక అక్రమ రవాణా, గుట్కా, ఇతర అంశాలను పోలీసులకు అప్పగించారు.

ఉమ్మడి జిల్లా పర్యవేక్షకులుగా

డిప్యూటీ కమిషనర్‌

జిల్లాకో ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌

పాత విధానంలోకి ఎకై ్సజ్‌ స్టేషన్లు

ఒక్కో జిల్లాలో ఏడు చొప్పున స్టేషన్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement