కర్నూలు(అగ్రికల్చర్): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి రూ.1.38 కోట్ల నిధులు మంజూరైనట్లుగా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్‌లో చిన్నపాటి వర్షం కురిసినా డ్రైనేజీ పొంగి మార్కెట్‌లో లోతట్టు ప్రాంతాల్లోను వ్యవసాయ ఉత్పత్తులను ముంచెత్తుతోంది. ఈ ఏడాది పలు సారు డ్రైనేజీ పొంగడం వల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్ల్లింది. ఈ దుస్థితిపై సాక్షి పలు కథనాలను ప్రచురించింది. వీటికి స్పందించిన జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా ఇటీవల మార్కెట్ యార్డులో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. అవసరమైన నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా అదనపు డ్రైనేజీ సౌకర్యం కల్పించేందుకు రూ.70 లక్షలు, డ్రైన్ కట్టర్, వరండా పైకప్పు అభివృద్ధికి రూ.28.50 లక్షలు, బోర్‌వెల్, పైపులైన్, ఆర్‌వోఆర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.15 లక్షలు, రెండు టాయ్‌లెట్స్ బ్లాక్‌లు నిర్మించేందుకు రూ.25 లక్షలు మంజూరైనట్లు ఏడీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment