ప్రేమోన్మాదిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు సోమవారం పట్టణంలోని పటేల్ సెంటర్‌లో రాస్తోరోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. విద్యార్థినిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు రఘురామ్మూర్తి, రమేష్‌బాబు, శ్రీనివాసులు, మహనంది, దినేష్ జిల్లా ఎస్పీని కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment