మహిళలకు రక్షణ కరువైంది
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. ఏపీని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా కూటమి ప్రభుత్వం మార్చింది. ముచ్చుమర్రి సంఘటన మరువకముందే పట్టణంలో బాలిక లహరి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడం దారుణం. మహిళలు, విద్యార్థినులపై వరుసగా దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత ప్రభుత్వం మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్‌ను తీసుకొచ్చింది. కూటమి సర్కారు వాటిని నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ గాలికొదిలేసింది. ఏదిఏమైనా బాలిక కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి.
– ధార సుధీర్,
వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు ఇన్‌చార్జ్
Comments
Please login to add a commentAdd a comment