● ఉమ్మడి జిల్లాలో 6.95 లక్షల
ఆయకట్టుకు కృష్ణా, తుంగభద్ర జలాలే
ఆధారం
● తెలంగాణ సర్కారు ఇష్టారాజ్యంగా
ఎడమ గట్టులో విద్యుత్ ఉత్పత్తి
● చోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం
● సాగునీటి విడుదలపై
కొరవడిన స్పష్టత
● నేడు సాగునీటి సలహా మండలి
సమావేశం
రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలవుతున్నా తాగు, సాగు నీటి గురించి పట్టించుకోవడంలేదు. ఎలాగోలా ఖరీఫ్ సీజన్ గడిచిపోయినా రబీ సీజన్‌లో జిల్లా రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన పేరుతో యథేచ్ఛగా వాడేస్తున్నా, టీబీ డ్యాంలోని మన నీటి వాటాను పొరుగు జిల్లా నాయకులు హెచ్చెల్సీ ద్వారా మళ్లీంచుకునేందుకు సిద్ధమవుతున్నా ఇక్కడి పాలకులు నోరుమెదపని పరిస్థితి. రబీకి నీటి విడుదలపై నేడు నంద్యాల కలెక్టరేట్‌లో సాగునీటి సలహామండలి సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
Comments
Please login to add a commentAdd a comment