మన్నించుతల్లీ..
చదువులో అలలా ఎగసినా
జీవితంలో ఓడిపోయావా తల్లీ
తల్లి చాటు బిడ్డవనీ దయతలచలేకపోయాం
ప్రేమ పేరుతో నీ ఆశలను కాల్చేశాం
నీ ఆశయాన్నీ బుగ్గిచేశాం
ఆ మృగమేదో నిను దహిస్తుంటే ఆపలేకపోయాం
నీ ఇంట్లోనే నీకు రక్షణ కల్పించలేకపోయాం
మమ్మల్ని క్షమించు తల్లీ...
నిన్ను కాపాడలేని పాలకులను మన్నించు
నువ్వేడున్నా ఇటువైపు చూడకు తల్లీ
బూడదైన నీ శరీరానికి ఇక ఎన్ని రంగులు
పులుముతారో
పెట్రోలులో మండిన నీ హృదయాన్ని
ఎంత గాయపరుస్తారో
తప్పంతా నీదేనని దుర్మార్గులూ...
నీ ప్రాణాలకు వెలకట్టే ‘అనిత’ర
సాధ్యులున్నారమ్మా
అందుకే ఇటువైపు రాకు తల్లీ
ఏ లోకంలో ఉన్నా హాయిగా ఉండు..
మరు జన్మలోనైనా మానవమృగాల్లేని
లోకంలో జన్మించు
Comments
Please login to add a commentAdd a comment