కర్నూలు (హాస్పిటల్): గతంలో జారీ చేసిన రెండు నోటిఫికేషన్లలో ఆదోని మెడికల్ కళాశాల, ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పోస్టుల భర్తీని రద్దు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన పోస్టుల వివరాలు, ప్రస్తుతం భర్తీ చేస్తున్న కర్నూలు, నంద్యాల మెడికల్ కళాశాలలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల పోస్టుల ఖాళీలు, రోస్టర్ పాయింట్ల వివరాలు, కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్‌సైట్లు https:// kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in, కర్నూలు మెడికల్ కళాశాల వెబ్‌సైట్ https:// kurnool medical college.ac.inలలో అభ్యర్థుల సమాచారం నిమిత్తం ఉంచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment