సారా బట్టీలు ధ్వంసం
కర్నూలు: బంగారుపేటలోని కేసీ కెనాల్ గట్టుపై ఉన్న సారా బట్టీలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, కృష్ణ తదితరులు వారి సిబ్బందితో బృందాలుగా ఏర్పడి శుక్రవారం ఉదయం బంగారుపేటలో ఉన్న నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. కేసీ కెనాల్ గట్టు వెంట పర్యటించి బట్టీలన్నీ ధ్వంసం చేశారు. సారా తయారీకి వినియోగించిన కుండలు, సామగ్రితోపాటు నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 2,400 లీటర్ల బెల్లం ఊట, 35 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. బంగారుపేటలో సారా విక్రయిస్తున్న గోనెల నాగదుర్గ వద్ద 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రహాస్ తెలిపారు. సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్, ఎకై ్సజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment