12,748 కేసులు పరిష్కారం
కర్నూలు (లీగల్): ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 12,748 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి జి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. కర్నూలులో 6,211 కేసులు, ఆదోనిలో 1,306, ఆళ్లగడ్డలో 246, ఆత్మకూరులో 126, ఆలూరులో 248, బనగానపల్లెలో 329, డోన్‌లో 419, కోవెలకుంట్లలో 265, నందికొట్కూరులో 310, నంద్యాలలో 1,621, పత్తికొండలో 73, ఎమ్మిగనూరులో 1,594 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు.
కక్షిదారులకు సత్వర న్యాయమే ధ్యేయం
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన న్యాయమూర్తి హాజరై మాట్లాడారు. కాలయాపన లేకుండా కేసులు పరిష్కరించడానికి న్యాయ సేవాధికార చట్టాన్ని రూపొందించారన్నారు. దీని ద్వారా వీలైనన్ని కేసులకు సత్వర పరిష్కారం లభించడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. తర్వాత ఫ్యామిలీ కోర్టు జడ్జి భూపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి పాండు రంగారెడ్డి, లోక్ అదాలత్ కార్యదర్శి ఎల్‌వీ శేషాద్రి, జూనియర్ సివిల్ జడ్జీలు సరోజనమ్మ, వందన తదితరులు పలు కేసులకు పరిష్కారం చూపారు. ఇందులో సీనియర్, జూనియర్ న్యాయవాదులు, ఇన్సూరెన్స్, పోలీస్, బ్యాంకు, రెవెన్యూ అధికారులు, పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌లో
జిల్లా జడ్జి కబర్ధి
Comments
Please login to add a commentAdd a comment