మార్కెట్‌లో ఒడిదుడుకులే కారణం
సమాజంలో డింక్ లాంటి సంస్కృతులు రావడానికి మార్కెట్‌లోని ఒడిదుడుకులే కారణం. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రైవేటు కంపెనీలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేవు. ప్రైవేటు ఉద్యోగాలు చేయాలంటే మెట్రోసిటీలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ పిల్లలు, వారి బాధ్యతలు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతామనే భయంతో నేటి యువత ఉన్నారు. ఈ క్రమంలో వారిలో డింక్ లాంటి ఆలోచనలు రావడంలో తప్పేమీలేదు.
– జీఆర్ శర్మ, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగి, కర్నూలు
వ్యక్తిగత స్వేచ్ఛ
కోరుకుంటున్నారు
భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ పిల్లలు ఇప్పుడే వద్దనే జంటలు ఇటీవల ఎక్కువయ్యారు. దీనికి ఆర్థిక ప్రాధాన్యత కూడా ఒక కారణం. ఆర్థికంగా స్థిరపడటం, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం ప్రధాన అంశాలు. ఇది ఒక కొత్త జీవనశైలి. దీనికి సామాజిక ఒత్తిడి కూడా ఒక కారణం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇంట్లో పిల్లలను పెద్దలే ఎక్కువగా చూసుకునేవారు. ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలను కంటే వారి ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు.
– డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్
ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు
30 ఏళ్ల తర్వాత పిల్లలను కంటే ఆరోగ్య సమస్యలు
సాధారణంగా 25 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు ప్రసవం అయితే వారికి జన్మించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 30 నుంచి 35 ఏళ్ల మధ్య గర్భం దాల్చితే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నెలలు నిండకుండా బిడ్డ జన్మించడం, బీపీ, థైరాయిడ్, షుగర్ వంటివి రావడం జరుగుతాయి. వివాహమైన వెంటనే పిల్లలను కనకూడదన్న ఆలోచన మంచిదే గానీ మరీ ఆలస్యమైతేనే ఇబ్బంది. కొంత మంది ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఎగ్ ఫ్రీజింగ్, సెమన్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు. దీనివల్ల వారు అనుకున్న వయస్సులో పిల్లలను కనేందుకు వీలు చేసుకుంటున్నారు. – డాక్టర్ పి.శిరీషారెడ్డి,
ఫెర్టిలిటీ స్పెషలిస్టు, కర్నూలు
●
Comments
Please login to add a commentAdd a comment