ఇప్పుడే మాకు పిల్లల్లొద్దు
పూర్వం వయస్సు మీద పడుతున్నా పెళ్లికాకపోతే ‘ఏమి ఇంకా పెళ్లి చేయలేదా’.. అనేవారు. పెళ్లయ్యాక ‘ఏమి ఇంకా పిల్లలు కాలేదా’ అని దెప్పిపొడిచేవారు. కానీ నేటి యువజంటల్లో కొందరు మాకు పిల్లలే వద్దని తెగేసి చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటాం.. గానీ ఇప్పుడే పిల్లలను కనేది లేదని అంటున్నారు. ‘చదువు, ఉద్యోగం పేరుతో ఇన్నాళ్లు కష్టపడుతూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఎంజాయ్ చేస్తాం. మాకు కావాలనుకున్నప్పుడు మాత్రమే పిల్లలను కంటాం’అని భీష్మించుకుని కూర్చుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు మాత్రమే ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే కర్నూలు నగరానికి కూడా పాకుతోంది.
– కర్నూలు(హాస్పిటల్)
ఉద్యోగ భద్రత లేకపోవడం
మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరినా వారికి ఇష్టం లేకపోయినా, కంపెనీకి వారి పని నచ్చకపోయినా ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత ఇంకో ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు ఒకే కంపెనీలో రెండు, మూడేళ్లు మించి పనిచేయడం లేదు. వారు మారడమో, కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించడమో చేయడం వల్ల వారు కంపెనీలు మారుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. కొంత కాలం వేచి చూసి ఉద్యోగం వల్ల కావాల్సినంత కూడబెట్టుకున్నామని భరోసా కలిగాక పిల్లలు, వారి పెంపకం గురించి ఆలోచించే వారు ఎక్కువయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment