కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద క్షేత్రం రాజగోపుర నిర్మాణానికి శనివారం గుడికల్లుకు చెందిన బోయ ఉలిగయ్యగారి నారాయణ, కవిత రూ.1,01,120 విరాళంగా అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు, బాండు అందజేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు విరివిగా విరాళాలు అందజేయాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్
కర్నూలు కల్చరల్: ఆర్‌యూ పరిధిలో డిగ్రీ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 96 శాతం, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 91 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగగా మొదటి సెమిస్టర్‌కు 3,156 మందికి 3,039 మంది విద్యార్థులు హాజరు కాగా 117 మంది, మూడు, ఐదో సెమిస్టర్‌కు 9,766 మందికి 8,874 మంది హాజరు కాగా 892 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నంద్యాల పీఎస్‌సీ, కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు, కర్నూలు డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర, ఎమ్మిగనూరు రావూస్ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment