అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
వెలుగోడు: ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జనార్దన్ రావు సిబ్బందిని హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఐదు రోజులుగా సామాజిక తనిఖీ సిబ్బంది 8 గ్రామ పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో ఆడిటింగ్ చేసి ఖర్చులు రికార్డులకు రాని నిధులను తెలియజేశారు. ఈ సందర్భంగా పీడీ మా ట్లాడుతూ రికార్డుల్లోకి రా ని ఖర్చులు అబ్దుల్లాపురం రూ.9,851, బోయరేవుల రూ.1,484, మాధవరం రూ.4,638, మోత్కూరు రూ.7,872, వేల్పనూరు రూ.1,455, రేగడ గూడ ూరు రూ.930, వెలుగోడు రూ.39 వేలు రికవరీకి ఆదేశించామన్నారు. కొన్ని పనులను ఎం బుక్‌లో చేర్చలేదని, కొన్ని పనులకు నో డిమాండ్ తీసుకోలేదని, కొన్ని పనులకు సంతకాలు లేకుండా పేమెంట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. పనుల వద్ద నీడ, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరారు. పట్టణంలోని ఆరు పనులకు ఉపాధి పనులు చేశామని ఉపాధి సిబ్బంది, పనులు చేయలేదని సామాజిక అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పీడీ ఆ పనులపై త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, డీవీఓ బా లాజీ నాయక్, ఏపీడీ అన్వర్ బేగం, ఉపాధి హామీ ఏపీ ఓ మల్లికార్జున, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులు, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయం సిబ్బంది, మేటీలు పాల్గొన్నారు.
డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జనార్దన్ రావు
Comments
Please login to add a commentAdd a comment