చదరంగంతో మానసిక వికాసం
నంద్యాల(న్యూటౌన్): చదరంగంతో మానసిక వికాసం కలుగుతుందని సినీ నటుడు సాయికిరణ్ అన్నారు. శుక్రవారం వివేకానంద ఆడిటోడియంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి చెస్ ర్యాంకింగ్ టోర్న మెంట్ ముగింపు పోటీల్లో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో నిరంతర సాధన చేస్తే చదరంగంలో రాణించవచ్చన్నారు. 18 ఏళ్ల వయస్సులోనే దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చాంపియన్‌గా భారతదేశం గర్వించే స్థాయిలో విజయం సాధించాడన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీ సుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమ ంలో జోనల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి రమేష్, చెస్ అసోసియేషన్ నాయకులు రవికృష్ణ, ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
విజేతలు వీరే..
బాలికల విభాగంలో..
అన్షిత(కర్నూలు), పాణ్య శ్రీవల్లి(ప్రకాశం), హారిక చౌదరి (అనంతపురం), అక్షయ, గితామాధురి (కృష్ణా)
బాలుర విభాగంలో..
సౌర్య ఆరియన్(కడప), కార్తికేయకృష్ణ(కృష్ణ), అర్జిత్ (నంద్యాల), భార్గవ శ్రీనివాసనాయక్(పల్నాడు)
Comments
Please login to add a commentAdd a comment