బీబీఏ విద్యార్థి ఆత్మహత్య
కొలిమిగుండ్ల: బీబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మద్దిరెడ్డి జనార్దన్, దేవి దంపతుల పెద్ద కుమారుడు శ్రీహర్ష(20) గుజరాత్‌లోని వడోదరలో బీబీఏ(బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్టేషన్) థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి స్థానికంగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో పని చేస్తుండగా తల్లి మీర్జాపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. శ్రీహర్ష చదివే కళాశాలలోనే ఓ విద్యార్థినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా కొద్ది రోజుల తర్వాత శ్రీహర్షను అమ్మాయి పట్టించుకోకపోవడం మనోవేదనకు గురయ్యాడు. దీంతో పది రోజుల క్రితం తల్లిదండ్రులు వడోదరకు వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చి ప్రొద్దుటూరులోని సైక్రియాటిస్ట్ వద్ద వైద్యం చేయిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం తల్లి పాఠశాలకు, తండ్రి గ్యాస్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తండ్రి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లితండ్రులు బోరున విలపించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment