విద్యుత్ వైర్ల దొంగలు అరెస్ట్
సంజామల: వ్యవసాయ విద్యుత్ మోటార్ల వైర్లు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న దొంగలను ఎట్టకేలకు శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ హనుమంతు నాయక్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఆకుమల్ల, కమలపురి, నట్ల కొత్తూరు గ్రామాల్లో రైతుల విద్యుత్ వైర్లు చోరీకి గురయ్యాయి. రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటకు చెందిన శివచంద్రుడు, బేతంచర్ల చెందిన ఇరగలి మురళి, పాణ్యం పాండురంగడు కలిసి రైతుల విద్యుత్ వైర్లను చోరీ చేసినట్లు ఆధారలు సేకరించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఆకుమల్ల, కమలపురి, నట్లకొత్తూరు, కోవెలకుంట్ల గ్రామాల్లో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ చేసే వైర్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ రమణయ్య, సిబ్బంది చెన్నయ్య, సురేస్, సురేంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment