● పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
ప్రయాణికుల అవస్థలు
నందికొట్కూరు: నందికొట్కూర్ నుంచి కర్నూలుకు వెళ్లే ప్రయాణికులు బస్సు సర్వీసులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదు. సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ఒక్స బస్సు సర్వీసు కూడా లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో ఉద్యోగులు నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాలకు కర్నూలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వారు ప్రతిరోజు సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్‌లో దాదాపు రెండు గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. విద్యార్థులు కూడా బస్సు సర్వీసులు లేకపోవడంతో ఒక్కో సారి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి సాయంత్రం 4. 30 గంటల నుంచి బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment