నంబర్ ప్లేట్ లేని 96 వాహనాలు సీజ్
కర్నూలు: నంబరు ప్లేట్ లేని 96 ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ఐ హుసేన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నగరంలోని సీ.క్యాంపు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నంబరు ప్లేట్ లేకుండా తిప్పుతున్న 96 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్టేషన్‌కు తరలించారు. మోటా రు వాహనాల చట్టం ప్రకారం ఒక్కో వాహనానికి రూ.535 చొప్పున 45 వాహనాలకు రూ.24,075 జరిమానా విధించి వసూలు చేశారు. మిగతా 51 ద్విచక్ర వాహనదారులు తమ వాహనాల నంబరు ప్లేట్లు తీసుకువచ్చి చూపించగా కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలకు కనిపించే విధంగా ఏర్పాటు చేసి వదిలేశారు. ఇకపై నిరంతరం ట్రాఫిక్ నిబందనల ఉల్లంఘణలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment