సాక్షి జర్నలిస్టులపై దాడి హేయం
నంద్యాల: పులివెందుల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో సాగునీటి సంఘాల ఎన్నికల కవరేజీకి వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రిక విలేకరి రాజారెడ్డిపై దాడి హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు పేర్కొన్నాయి. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై కూటమి నాయకులు దాడి చేయడం బాధాకరమని, రాజకీయంగా కక్షలు ఉంటే రాజకీయంగానే చూసుకోవాలని సూచించాయి. సాక్షి జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ శుక్రవారం జర్నలిస్ట్ సంఘాల నాయకులు, పాత్రికేయులు జిల్లాలో నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాలు చేపట్టారు. నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు చల్లా మధు, వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ట్రెజరర్ వై.జాషువా, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ పి.హరినాథరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని, జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్ట్‌లపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న పార్టీలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు శరత్, నాగప్రసాద్, బాషా, రాజేష్, నిరంజన్, విజయ్, బాలునాయక్, మౌలాలి, కుమార్, పవన్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
దాడికి పాల్పడిన వారిపై
కఠిన చర్యలు తీసుకోవాలి
జర్నలిస్ట్ సంఘాల నాయకులు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment