కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా ప్రీమియం చెల్లింపు శనగ, జొన్న, వేరుశనగ, ఉల్లి, టమాట పంటలకు ఈ నెల 15 వరకే గడువు ఉంది. రైతులతో ప్రీమియం కట్టించాలని జిల్లా యంత్రాంగం ఏవోలు, రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జీలపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అన్ని పంటలకు కలిపి 22,943 మంది రైతులు ప్రీమియం చెల్లించినట్లు తెలుస్తోంది. శనగకు 14,801 మంది, వేరుశనగకు 1,923, ఉల్లికి 418, వరికి 219, జొన్నకు 5,396, టమాటకు 186 మంది ప్రకారం రైతులు ప్రీమియం చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. రైతులు ప్రీమియం కింద రూ.1,93,26,555 చెల్లించినట్లు సమాచారం. వరికి ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 31 వరకు అవకాశముండగా..మిగిలిన పంటలకు ఆదివారంతో ప్రీమియం చెల్లింపు గడువు పూర్తవుతోంది.
డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో మే/జూన్ నెలల్లో జరిగిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు ఫలితాలను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపడం జరిగిందని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు 120 మంది హాజరు కాగా 63 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 264 మంది హాజరు కాగా 122 మంది, మూడవ సంవత్సరం పరీక్షలకు 519 మంది హాజరు కాగా 249 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment