స్టడీ అవర్స్ నిర్వహించకపోవడంపై డీఈఓ సీరియస్
పాములపాడు: మండలకేంద్రం పాములపాడులోని ఏఎన్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్టడీ అవర్ నిర్వహించకపోవడంపై డీఈఓ జనార్దన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఉదయం 8.20 గంటల సమయంలో ఆయన పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులెవ్వరు లేకపోవడంతో ఆయన స్వయంగా స్టడీ అవర్ నిర్వహించారు. తర్వాత హెచ్‌ఎం గోపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. అలాగే సమయపాలన పాటించని ఉపాధ్యాయులను వివరణ కోరారు. పూర్తైన పాఠ్యాంశాలు, విద్యార్థుల హాజరు తదితర విషయాలపై ఆరా తీశారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గితే సహించేది లేదని హెచ్చరించారు. వేళకు రాకపోతే ఎలా అని ఉపాధ్యాయులపై మండిపడ్డారు. అనంతరం ఏపీ మోడల్‌స్కూలు, కేజీబీవీ పాఠశాలలను తనిఖీ చేసి తరగతి గదులు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓలు బాలాజీనాయక్, సుభాషిణి దేవి, సీసీ రామకృష్ణ, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఏఎన్‌ఆర్ జెడ్పీహైస్కూల్ హెచ్‌ఎంకు
మెమో జారీ
Comments
Please login to add a commentAdd a comment