నంద్యాల: రైతులు నష్టపోకుండా మద్దతు ధరతో బియ్యం కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రైస్ మిల్లర్లు, ట్రేడర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బియ్యం కొనుగోలు అంశంపై రైస్ మిల్లర్లు, ట్రేడర్లతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో వరి పంట దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. ఇక్కడి బియ్యానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఉందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత సీజన్లో పంట దిగుబడి అధికంగా రావడంతో కొంతమేర ధరలు తగ్గాయన్నారు. కొన్నిచోట్ల బియ్యంలో తేమశాతం సాకుగా చూపి మిల్లర్లు, ట్రేడర్లు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధాన్యంలో తేమ శాతాన్ని సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో పరీక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకట్రాముడు, డీఏం సివిల్ సప్లయ్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment