‘డింక్‌’తో దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు | - | Sakshi
Sakshi News home page

‘డింక్‌’తో దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు

Published Sun, Dec 15 2024 1:57 AM | Last Updated on Sun, Dec 15 2024 1:57 AM

‘డింక్‌’తో దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు

‘డింక్‌’తో దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు

చైనా వంటి దేశాల్లో యువత కంటే వృద్ధులే అధిక సంఖ్యలో ఉండటంతో అక్కడ అభివృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోంది. ఈ కారణంగా ఒకప్పుడు పిల్లలే వద్దని చెప్పిన ఆ దేశం ఇప్పుడు ఎంత మంది పిల్లలనైనా కనండని చెబుతోంది. ఎందుకంటే పిల్లలు కనకపోతే ఆ దేశాభివృద్ధి ఆగిపోతుంది. ఏ దేశానికై నా యువతీయువకులే ఆయువుపట్టు. అభివృద్ధికి వారే మూలాధారాలు. యువత ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో డింక్‌ అనే లైఫ్‌స్టైల్‌ పేరుతో యువతీయువకులు పిల్లలు వద్దంటే ఈ దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. జననాల రేటు తగ్గిపోయి కొంతకాలానికి ఈ దేశంలో వృద్ధ్దుల సంఖ్య ఎక్కువై పనిచేసే యువత సంఖ్య తక్కువ అవుతుంది. అప్పుడు మళ్లీ పేద దేశంగా మన దేశం మారిపోతుంది. సంతానోత్పత్తి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజమూ మనజాలదు. ఇంట్లో, కుటుంబంలో పిల్లలు ఉండటాన్ని తల్లిదండ్రులకే కాదు అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement