అంతా మా ఇష్టం! | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం!

Published Sun, Dec 15 2024 1:57 AM | Last Updated on Sun, Dec 15 2024 1:57 AM

అంతా

అంతా మా ఇష్టం!

సాగునీటి సంఘాల ఎన్నికల్లో

రెచ్చిపోయిన కూటమి నేతలు

సహకరించిన అధికారయంత్రాగం

రైతులకు నో డ్యూస్‌

సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఇబ్బందులు

ఏకపక్షంగా సాగిన ఎన్నికలు

చెప్పిన పేర్లు రాసుకోండి..

ఇక్కడ క్లాసు రూంలో కూర్చుని నోట్స్‌ రాసుకుంటున్న వారు విద్యార్థులు కాదు. సాగు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు వచ్చిన అధికారులు. ఇక్కడ 16 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి ఒక గది (పోలింగ్‌ కేంద్రం) కేటాయించారు. అయితే, అధికారులందరూ ఒకే గదిలో కూర్చుని అధికార పార్టీ నేత చెప్పిన పేర్లు పత్రాల్లో రాసుకుని వారు ఎన్నికల్లో గెలుపొందినట్లు ధ్రుపత్రాలు అందజేసి చేతులు దులుపుకున్నారు. కనీసం పోటీ చేసే అభ్యర్థుల సంతకాలైనా తీసుకున్నారా లేక అవి కూడా అధికారులే చేశారా అనే చర్చ సాగుతోంది.

నంద్యాల(రూరల్‌): సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. అధికార పార్టీ నేతలకు అన్ని శాఖల్లోని అధికార యంత్రాంగం దాసోహం కావడంతో ఎన్నికలు ఎక్కడ కూడా రాజ్యాంగ బద్ధంగా జరగలేదు. జిల్లాలో మొత్తం 261 సాగునీటి వినియోగదారుల సంఘాలున్నాయి. వీటికి శనివారం ఎన్నికలు నిర్వహించారు. కూటమి నాయకుల కనుసన్నల్లో అవి ఏకపక్షంగా జరిగాయి. జిల్లాలో పలు మండలాల్లో రైతులు పోటీకి ఆసక్తి చూపినా అధికార పార్టీ నాయకులు ఎలాగైనా కై వసం చేసుకోవాలని అధికారుల సాయంతో వారిని అడ్డుకున్నారు. ఒక రోజు ముందుగా అభ్యర్థులు తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళితే నో డ్యూ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. సాగునీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి దోచుకోవాలనే దురాలోచనతో కూటమి సర్కారు ఇలాంటి కుతంత్రలకు తెరలేపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

● నంద్యాల జిల్లా మిడుతూరు మండలానికి చెందిన రామకృష్ణ అనే సాగునీటి సంఘం రైతుకు నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తహసీల్దార్‌ ఇవ్వకపోవడంతో ఆయన చరవాణి ద్వారా ఇరిగేషన్‌ ఈఈ రాఘరామిరెడ్డిని సంప్రదించాడు. రెవెన్యూ అధికారులకు అడగాలని ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో అతను విలువైన ఓటును వినియోగించుకోలేక పోయాడు.

● కొలిమిగుండ్ల మండలం హనుమంతు గుండం గ్రామంలో నో డ్యూస్‌ సర్టిఫికెట్‌లు సరిగాలేవని కొందరు రైతులను పోలీసులు ఓటింగ్‌కు అనుమతించలేదు.

● మండల కేంద్రం పగిడ్యాలలోని 10,11 టీసీల ఎన్నికల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య అభ్యర్థుల విషయంలో వివాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. వెంటనే అక్కడికి ఆర్డీఓ నాగజ్యోతి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

● శిరివెళ్ల మండలానికి చెందిన సాగునీటి సంఘం రైతుల్లో కొందరికి రెవెన్యూ అధికారులు నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. దీనిపై బాధిత రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

● జూపాడుబంగ్లా సాగునీటి సలహా సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా గేట్‌వేసి అడ్డుకున్నారు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అంతా మా ఇష్టం!1
1/2

అంతా మా ఇష్టం!

అంతా మా ఇష్టం!2
2/2

అంతా మా ఇష్టం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement