అభిమానం ఉప్పొంగింది. జై జగన్ నినాదం హోరెత్తింది. సేవాభ
● పండుగలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ● కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ● సేవా కార్యక్రమాలు చేపట్టిన పలువురు నేతలు
కల్లూరులో కేక్ కట్
చేస్తున్న వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
బొమ్మలసత్రం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం జిల్లాలో అంబరాన్ని తాకాయి. సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అభిమాన నేత జగన్ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. కల్లూరులోని ఆయన నివాసానికి ఉదయమే భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి సమక్షంలో కాటసాని కేక్ కట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే టూ యూ జగన్ అంటూ నినదించారు. కర్నూలు నగరంలో 40 వ వార్డు కార్పొరేటర్ విక్రమ్‌సింహారెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లకు కాటసాని దుస్తులు పంపిణీ చేశారు. అక్షయ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షుడు నాగార్జున ఆధ్వర్యంలో డాన్ బోస్కో అనాథ శరణాలయంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్యెల్యే రాంభూపాల్‌రెడ్డి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి తినిపించారు.
●బనగానపల్లెలో మాజీ శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి ఇంటి వద్దకు పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మండల కన్వీనర్లు కాటసాని తిరుపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కొలిమిగుండ్ల వైఎస్సార్సీపీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
● డోన్ పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్‌రెడ్డి స్వగృహంలో మిడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ బద్దెల రాజ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ రాజేష్ తదితరులు కేక్ కట్ చేశారు.
● నందికొట్కూరులో పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కోకిల రమణారెడ్డి , జెడ్పీటీసీ జగదీశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో జననేత జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కర్నూలు– గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
● శ్రీశైల నియోజకవర్గ పరిధిలోని వెలుగోడులో పార్టీ సీనియర్ నాయకుడు శిల్పా భువనేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మండలాధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు, అభిమానులు వైఎస్ జగన్ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి జై జగన్ అంటూ నినదించారు.
● కోవెలకుంట్ల పట్టణంలో ఏపీ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ కర్రా గిరిజ, హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment