శ్రీశైలంలో 115 టీఎంసీల నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల జలాశయంలో శనివారం సాయంత్రం సమయానికి 114.9952 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 862.90 అడుగులకు చేరుకుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు జలాశయంలో 7,766 క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని ఎడమగట్టు కేంద్రంలో 3.652 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. పంప్‌మోడ్ ఆపరేషన్ ద్వారా 7,602 క్యూసెక్కుల నీటిని జలాశయంలోకి మళ్లించారు. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లైన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ,హంద్రీనీవా సుజల స్రవంతి, నాగార్జునసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతలకు 13,294 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
తెలుగుగంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా సంజీవకుమార్
నంద్యాల(అర్బన్): తెలుగుగంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా శిరివెళ్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన చెన్నారెడ్డి సంజీవకుమార్‌రెడ్డి ఎంపికయ్యారు. స్థానిక కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో 8 మంది డిస్ట్రి బ్యూటరీ కమిటీ సభ్యులు సంజీవకుమార్‌రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలుగుగంగ ఎస్‌ఈ సుబ్బరాయుడు ఎన్నిక పత్రం అందజేశారు. బండిఆత్మకూరు మండలం నారాయణాపురం గ్రామానికి చెందిన మనోహర్ చౌదరి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అదే విధంగా కేసీ కెనాల్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామానికి చెందిన బన్నూరు రామలింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 14మంది డీసీలు రామలింగారెడ్డికి మద్దతు ప్రకటించారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్ ప్రకటించారు. ఎస్సార్బీసీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా పల్లె జిల్లెల్ల గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
తగ్గుతున్న కందుల ధర
కర్నూలు(అగ్రికల్చర్): ఇటీవల వరకు రైతులను మురిపించిన కందుల ధర తగ్గుతోంది. ఒక దశలో క్వింటం కందులు రూ.13,000కు పైగా పలికింది. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ గత ఏడాది బహిరంగ మార్కెట్ ధరకే కందులను కొనుగోలు చేసింది. ఈ సారి కూడా నాఫెడ్ బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కందుల కొనుగోలుకు ముందుకు వచ్చి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. 2024 ఖరీఫ్‌లో సాగు చేసిన కంది పంట కొద్ది రోజులుగా మార్కెట్‌కు వస్తోంది. క్రమంగా ధర తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 271 మంది రైతులు 1,797 క్వింటాళ్ల కందులు తెచ్చారు. కనిష్ట ధర రూ.1,156, గరిష్ట ధర రూ.7,649 లభించింది. సగటు ధర రూ.7,019 నమోదైంది. నూర్పిడిలో ముక్కలు, పగిలిన కందులను ప్రత్యేకంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటువంటి కందులు మార్కెట్‌కు 45 క్వింటాళ్లు వచ్చింది, దీనికి క్వింటాలుకు కనిష్టంగా రూ.706, గరిష్టంగా రూ.3,600 లభించింది.సగటు ధర రూ.3,200 లభించింది. కందులకు మద్దతు ధర రూ.7,550 ఉంది. మద్దతు ధర కంటే తక్కువకు ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత పడిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment