క్రిమినల్ ప్రొసీజర్‌పై అవగాహన పెంచుకోవాలి
● జిల్లా కోర్టు న్యాయయూర్తుల వర్క్‌షాపులో హైకోర్టు జడ్జి మన్మథరావు
కర్నూలు(సెంట్రల్): క్రిమినల్ ప్రొసీజర్‌పై న్యాయమూర్తులు అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి కర్నూలు జిల్లా పోర్టుఫోలియో జడ్జి, హైకోర్టు జడ్జి జస్టిస్ మన్మథరావు సూచించారు. శనివారం జిల్లా కోర్టులో న్యాయమూర్తులకు క్రిమినల్ ప్రోసీజర్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్పష్టమైన సాక్ష్యాలు ఉన్న కేసులపై సాగదీత అవసరం లేదన్నారు. బీమా కంపెనీల మోసాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ నేరాలు పెరిగాయని, కొందరు నేరస్తులు సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించుకోవడానికి చూస్తున్నారన్నారు.ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు టెక్నాలజీపై అవగాహన కలి గి ఉండాలన్నారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, సీనియర్ అడ్వొకేట్ రోజ్‌ధర్ పాల్గొన్నారు.
జడ్జీలను కలిసిన జిల్లా కలెక్టర్
జిల్లాకు వచ్చిన ఏపీ హైకోర్టు జడ్జీలు జస్టిస్ డా.కె. మన్మథరావు, జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తిని స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్‌బాషా కలిశారు. వారికి మర్యాదపూర్వకంగా బొకేలు అందించి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment