సాగుకు స్వస్తి పలికాం
పట్టు సాగులో విశేషంగా రాణిస్తున్నందుకు నాకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. బైవోల్టెన్ పట్టు గూళ్ల ఉత్పత్తికి గతంలో కిలోకు రూ.50 ఇంటెన్సివ్ లభించేది. ప్రస్తుతం రైతులకు ఇది లేకుండా పోయింది. పెట్టుబడి వ్యయం ఎక్కువవుతున్నా సబ్సిడీలు పెరగడం లేదు. పట్టు గూళ్ల ధరలు పెరగకపోవడంతో పట్టు సాగుకు స్వస్తి పలికి పొగాకు, మినుము తదితర వాటిపై ఆసక్తి చూపుతున్నాం. – భాస్కరరెడ్డి, ఆత్మకూరు
నష్టాలు
మూట కట్టుకుంటున్నాం
పట్టులో ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయవచ్చు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. మూడు, నాలుగు పంటలే గగనం అవుతున్నాయి. ఒక్కోపంటకు రూ.80 వేలకుపైగా ఖర్చు వస్తోంది. పెట్టుబడి వ్యయం రూ.2.50 లక్షలు అయ్యింది. మూడు పంటలపై వచ్చిన పట్టుగూళ్లను అమ్మగా కేవలం రూ.1.90 లక్షలు మాత్రమే వచ్చింది. నష్టాలు మూట గట్టుకున్నాం.
– మధుసూదన్, రామసముద్రం,
జూపాడుబంగ్లా మండలం
ఫిర్యాదులు వస్తున్నాయి
డోన్ మండలం ఉడుములపాడు సమీపంలో ఉన్న కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రభావం సూదేపల్లి సాగు చేస్తున్న మల్బరీపై పడుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏడాదికేడాది పురుగు మందుల వినియోగం పెరుగుతోంది. దీంతో మల్బరీ సాగు నుంచి కొంతమంది రైతులు దూరం అవుతున్నారు. మల్బరీ సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– విజయకుమార్,
జిల్లా పట్టు పరిశ్రమ అధికారి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment