రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
మహానంది: నంద్యాల–గిద్దలూరు రైలు మార్గంలో ఓ వ్యక్తి బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ జనార్దన్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహమ్మద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని వద్ద గిద్దలూరు నుంచి నంద్యాల వరకు రైలు టికెట్ ఉన్నట్లు గుర్తించారు. చలమ–గాజులపల్లె రైలు మార్గం మధ్యలో ఘటన జరిగిందని, మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే రైల్వే ఎస్‌ఐ(94406 27653), హెడ్ కానిస్టేబుల్ (94900 81633)లకు సమాచారం అందించాలని ఎస్‌ఐ అబ్దుల్ జలీల్ విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
డెకరేషన్ లైట్లను పట్టుకుని వ్యక్తి మృతి?
ఆదోని రూరల్: స్వామి ఊరేగింపులో ఓ వ్యక్తి జారి పడి డెకరేషన్ లైట్లను పట్టుకుని మృతిచెందాడు. ఈ ఘటన ఆదోని మండలంలోని దిబ్బనకల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని అఖండస్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలను మంగళవారం చేపట్టారు. స్వామి వారి ఊరేగింపు జరుగుతుండగా కురువ వీరేష్(40) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతిచెందినట్లు తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపా రు. దిబ్బనకల్ గ్రామానికి చెందిన కురువ వీరేష్ గ్రామంలో ఉత్సవం జరుగుతుండగా జారి పడి డెకరేషన్ తీగల లైట్లను పట్టుకుని మృతిచెందాడని చెప్పా రు. మృతుడి భార్య కురువ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టంకు తరలించినట్లు చెప్పారు. మృతుడికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
భేదాభిప్రాయాలు లేవు : వైదిక కమిటీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఉభయ దేవాలయాల అర్చకుల మధ్య భేదాభిప్రాయాలు లేవని, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం అవాస్తమని దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. శ్రీశైల దేవస్థాన వైదిక కమిటీ స్వామివారి ఆలయ ప్రధానార్చకులు వీరన్నస్వామి, అమ్మవారి ప్రధానార్చకులు మార్కండేయశాస్త్రి, సీనియర్ వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ, అధ్యాపక పూర్ణానంద ఆరాధ్యులు మాట్లాడుతూ.. శ్రీశైలక్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో పూజా కై ంకర్యాలను ఆగమశాస్త్రానుసారంగా, పరిపూర్ణంగా జరిపించాలని ఈఓ సూచించారన్నారు. శాస్త్ర బద్ధంగానే పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, ముఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment