భక్తి శ్రద్ధలతో నృసింహస్వామి దీక్ష | - | Sakshi
Sakshi News home page

భక్తి శ్రద్ధలతో నృసింహస్వామి దీక్ష

Published Thu, Jan 16 2025 7:43 AM | Last Updated on Thu, Jan 16 2025 7:43 AM

భక్తి శ్రద్ధలతో నృసింహస్వామి దీక్ష

భక్తి శ్రద్ధలతో నృసింహస్వామి దీక్ష

ఆళ్లగడ్డ: శ్రీమద్‌ అహోబిలం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దీక్షను భక్తులు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. పారువేట ఉత్సవాల్లో భాగంగా స్వామి గ్రామాల్లో పర్యటించేందుకు బయలుదేరే రోజున దీక్షను ప్రారంభించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం రాత్రికే దేశం నలుమూలలనుంచి అహోబిలం చేరుకున్న భక్తులు మంగళవారం తెల్లవారు జామునే పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు దుస్తులు ధరించి ఎగువ, దిగువ అహోబిలంలో వెలసిన మూలమూర్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం దిగువ అహోబిలం దేవాలయం ఎదురుగా యాగశాలలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీసుదర్శన హోమం నిర్వహించారు. అర్చకులు దీక్షా పరులకు శ్రీ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దీక్ష మాలలను వేసి ఆశీర్వదించారు. దీక్షాపరులు నేటి నుంచి 41 రోజులు ఈ దీక్ష సాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement