ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంక్రాంత్రి సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు మూడు రోజులూ ఇళ్ల ముందు కళ్లాపి జల్లి రంగు రంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి అలంకరించారు. సంస్కృతి సంప్రదాయలతోపాటు సందేశాత్మక ముగ్గులు ఆకట్టుకున్నాయి. పిండివంటలు చేసి ఇళ్లలోనూ, ఆలయాల్లోనూ దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంప్రదాయ దుస్తులతో బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు. పలు చోట్ల ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment