ఉన్నతాధికారుల ఆదేశానుసారమే
అహోబిలం ట్రస్ట్‌తో దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. మొబైల్ మెడికల్ సర్వీస్ వాహనం ఇక్కడ ఉన్నది వాస్తవమే. దేవస్థానం పేరు చెప్పి వసూలు చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వేలంపాటలు, ఇతర లావాదేవీల గురించి నాకు సంబంధం లేదు. టిక్కెట్ ధరల పెంపు ఉన్నతాఽధికారుల ఆదేశానుసారమే చేశాం. – మురళీధన్, జనరల్‌మేనేజర్,
అహోబిలం దేవస్థానం
గుడి ప్రతిష్టతను
మంటగలుపుతున్నారు
సుమారు 40 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి చూడలేదు. స్థానిక నాయకులతోను, గ్రామస్తులతో గాని ఏమాత్రం ఆలోచించకుండానే ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మఠం నిర్వాహుకులు అందరూ తమిళనాడులో ఉంటూ ఇంత పెద్ద దేవస్థానాన్ని గాలికొదిలేయడంతో ఇక్కడున్న అధికారులు గుడి ప్రతిష్టతను మంటగలుపుతున్నారు.
– నాసారి వెంకటేశ్వర్లు, అహోబిలం
భక్తులను దోచుకునేందుకే..
అహోబిలంకు అత్యధికంగా వచ్చేదంతా గ్రామీణ ప్రాంతాల భక్తులే. ఇప్పటికే దిగువ అహోబిలంకు ఒక గేటు, ఎగువ అహోబిలంకు మరో గేటు వసూలు చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రసాదం, దర్శనం, తలనీలాల టిక్కెట్ల ధరలు పెంచడమంటే భక్తులను దోచుకోవడమే. ఆదాయమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉంది.
– నాగార్జున రెడ్డి, దొరకొట్టాల
●
Comments
Please login to add a commentAdd a comment