● హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు ‘అహోబిలం ట్రస్ట్’ అని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా స్వామి పార్వేట పల్లకీ వెళ్లే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతామని మరో రెండు ఎన్‌జీఓలతో ఎంఓయూ కూడా చేసుకున్నారు. అభివృద్ధి చేస్తున్నామని చూపించుకునేందుకు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న ఓ పాత మొబైల్ మెడికల్ సర్వీస్ వాహనం తెచ్చి దేవాలయం ఎదురుగా ఉంచారు. ఇది చూపిస్తూ ఎన్ని రూ. లక్షలు వసూలు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. తమకు సంబంధం లేదు అంటున్న దేవస్థాన అధికారులు ఈ వాహనం అక్కడ ఉంచడంతో పాటు ట్రస్ట్ నిర్వాహుకుడు అని చెప్పుకునే వ్యక్తికి దేవస్థాన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ ఆఫీస్ గదిని కూడా కేటాయించడం పలు విమర్శలకు తావిస్తోంది.
● గతంలో ఉత్తరప్రదేశ్‌లో గుడి కడుతున్నామని దేవస్థానం ఖాతా నుంచి రూ 3.25 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న విషయం తీవ్ర దుమారం లేపింది. దీంతో ఆరు నెలలకు తిరిగి అదే ఖాతాకు నగదు జమ చేయడం జరిగింది. అయితే ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారో ?, ఈ ఆరు నెలల వడ్డీ ఎవరు భరాయించాలో తదితర సవాలక్ష సమాధానం లేని ప్రశ్నలు భక్తులను వేధిస్తున్నాయి.
● అధికారే సొంత సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ తరుఫున ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు తీసుకోవడంతో పాటు నెలనెలా వారి జీతాల్లో నుంచి భారీగా కమీషన్ కూడా పట్టుకునే విధంగా ఒప్పందం చేసుకుని కొంత మంది రిటైర్డ్ ఉద్యోగులను ఉద్యోగాల్లో తీసుకున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఉన్న ఉద్యోగులకే జీతాలు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్న దేవస్థానం కొత్తగా ఇంత మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవడంతో పాటు 15 నుంచి 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకంటే వీరికి రెండింతలు జీతం ఇచ్చి తీసుకోవడం ఒక ఎత్తైతే వీరికి ఏ పని చెప్పకుండా గేట్ల దగ్గర నిల్చోబెట్టి రూ. లక్షల జీతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment