ఉపాధి కూలీలకు ‘హౌసింగ్’ పని
నంద్యాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు హౌసింగ్ మ్యాండేస్‌లో భాగంగా 90 రోజుల పని దినాలు కల్పించాలని, వారికి దినసరి సరాసరి రేటు పెరుగుతుందని క్షేత్రస్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, హౌసింగ్ మ్యాండేస్, సచివాలయ సర్వీసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లస్టర్ల వారీగా గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మంజూరు చేసిన 850 గోకులం షెడ్ల నిర్మాణాలకు గాను 276 మాత్రమే పూర్తి చేశారని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్దేశించిన 4,772 గృహ నిర్మాణాల లక్ష్యాన్ని మార్చి 31వ తేదీలోగా పూర్తి చేసేలా హౌసింగ్ డీఈ, ఏఈలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్‌కు సంబంధించి ఇంకా 16 లక్షల 5 వేల పని దినాలు కల్పించాల్సి ఉందన్నారు. ప్రతిరోజు ప్రతి గ్రామపంచాయతీలో వందమంది ఉపాధి వేతనదారులకు మార్చి 31వ తేదీలోగా పనులు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏపీఓ, ఎపీడీ, ఎంపీడీఓలను ఆదేశించారు. సచివాలయ సిబ్బందికి కేటాయించిన ఎనిమిది రకాల సర్వేలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయించాలని ఎంపీడీఓలకు సూచించారు. సచివాలయ ఉద్యోగుల హాజరు ఇన్‌టైం, అవుట్ టైం కచ్చితంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ జనార్దన్ రావు, హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లేబర్ మొబిలైజేష పై
ప్రత్యేక శ్రద్ధ సారించాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment