బావి నిండా శిల్ప కళ
పురాతన భోజరాజుబావి
పురాతన బావి శిల్పా కళ అందాలతో ఆకట్టుకుంటోంది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించినట్లు చెప్పుకుంటున్న ఈ బావి మండల కేంద్రం మద్దికెరలో ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బావి దగ్గరికి వెళ్లి చూస్తే అబ్బురపోవాల్సిందే. అంతలా శిల్ప కళ ఉట్టిపడుతోంది. బావిలో కట్టడంలో వినియోగించిన రాళ్లపై చెక్కిన శిల్పాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునేందుకు మెట్లు, వ్యవసాయానికి నీళ్లు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ పురాతన బావిని నేటికీ పెద్ద నగరి వంశస్తులు కాపాడుకుంటూ వస్తున్నారు. – మద్దికెర
Comments
Please login to add a commentAdd a comment