![కట్టను చదును చేసి.. దర్జాగా రహదారి వేసి..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/03alg01a-200021_mr-1738872783-0.jpg.webp?itok=SfJlv1DB)
కట్టను చదును చేసి.. దర్జాగా రహదారి వేసి..
ఇక్కడ కనిపిస్తున్నది ఇతర గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం వేసిన రహదారి అనుకుంటే పొరపాటే. ఇది కోటకొండ కల్యాణి చెరువు కట్ట. ఈ చెరువు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల పరిధిలో ఉండటంతో పాటు కట్ట పక్కనే రిజర్వు ఫారెస్ట్ ట్రెంచ్ సైతం ఉంది. అయినప్పటికీ చెరువు కట్టను చదును చేసి రోడ్డు వేశారు. అక్రమంగా రూ.కోట్లు విలువైన మట్టి దందా కొనసాగించేందుకు వందల ఏళ్ల క్రితం నిర్మించిన చెరువు కట్టను ధ్వంసం చేశారు. ఒక వేళ మళ్లీ కట్ట నిర్మించినా అంత బలంగా ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment