కార్మికులకు రూ.12వేల జీవనభృతి ఇవ్వాలి
నారాయణపేట: వ్యవసాయ కార్మికులందరికీ రూ.12 వేలు జీవనభృతిని ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీమ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేంత్‌రెడ్డి గతేడాది ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను ఇస్తామని, వ్యవసాయ కూలీలకు జీవన భృతి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వ్యవసాయ రంగంలో సన్న, చిన్న కారు రైతులు 50 శాతానికి పైగా వ్యవసాయ కూలీలు వ్యవసాయ ఉత్పత్తిలో మహిళా కార్మికులు అధికంగా ఉన్నారన్నారు. బీడీ, చేనేత కల్లుగీత కార్మికులకు ఇచ్చే విధంగా వ్యవసాయ కార్మికులకు నెలకు రెండు వేల పెన్షన్ వర్తింపజేయాలని, అసరా పించన్లను రూ.4 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లాలో వ్యవసాయ కార్మికులను గ్రామాల్లో పట్టణాల్లో సమీకరించి నవంబర్ 20 నుండి 30 తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, 25న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, 30న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రజా, రైతు సంఘం నాయకులు హాజీ మలంగ్, వెంకట్ రాములు, నరసింహులు, కనక రాయుడు, మల్లేష్ , రాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment